మా వీధిలోని కుక్కలకూ....
ఓ వీధి బాలకునికీ నివాసం అక్కడే!
ఆకలేస్తే.. అందరూ తిని పారేసే,
విస్తర్లలోని మెతుకులే పరమాన్నం వాడికి.
చలివేస్తే కుండీలో చెత్తే వెచ్చని దుప్పటి
వానొస్తే చివికిపోయిన గోనె బస్తాయే గొడుగు
కని పారేసే తల్లులు కన్నా....
విశ్వాసం వున్న కుక్కలే మిన్న
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి