వరుణ దేవుడు పయనమయ్యను దివి నుండి భువికి
వాన చినుకులతో మనిషిలోని మలినాన్ని కడగాలని,
మానవత్వపు సిరులెన్నిటినో పెంచాలని,
పచ్చని పైరుపై కురిసి ప్రతి రైతును అన్నదాతగా నిలపాలని,
ప్రాణులదాహం తీర్చే గంగమ్మను నింపాలని,
పుడమితల్లి ఒడిలోన ఆటలాడాలని,
ప్రకృతికాంత ఎదపై సేదతీరాలని
వరుణ దేవుడు పరుగు పరుగున వచ్చెను దివి నుండి భువికి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి