ఉదయించే సూర్యుని నులి వెచ్చని కిరణమవ్వాలని ఆశ!
పచ్చికపై మెరిసే మంచుబిందువునవ్వాలని ఆశ!
వికసించే పువ్వులు వెదజల్లే పరిమళమవ్వాలని ఆశ!
నింగిలో స్వేచ్చగా విహరించే పక్షినవ్వాలని ఆశ!
పచ్చని చెట్లు వీచే స్వచ్చమయిన పవనమవ్వాలని ఆశ!
తీరం తాకే పాలనురుగుల కెరటానవ్వాలని ఆశ!
ఆకాశంలో తళుకులీనే తారనవ్వాలని ఆశ!
చందమామ కురిపించే చల్లని వెన్నెలనవ్వాలని ఆశ!
జనసంద్రం హృదయంలో నా కవిత కలకాలముండాలని ఆశ!
Vennela, excellent..simply superb...
రిప్లయితొలగించండి