నవ దశాబ్దానికి సుస్వాగతం


కొత్త ఆశలతో
కొత్త ఊహలతో
కొత్త ఆశయాలతో
కొత్త కోరికలతో

జీవితమనే పుస్తకంలో..
నిన్నటి పుటలోని చరిత్రను స్మరిస్తూ,..
నేటి పుటనుండీ భవితను అనుసరిస్తూ...

కన్నీటిని తుడుచుకుంటూ,..
కష్టాలను భరిస్తూ....

అపజయాలకు ఎదురీదుతూ..
విజయపధంలో పయనిస్తూ...

నవ్వుల గల గలలను వినిపిస్తూ
సుఖాల వనంలో విహరిస్తూ..


నవ దశాబ్దాన్ని స్వాగతిద్దాం..

నేస్తం - కడదాక -నీతో నేను


మిత్రమా...
నువ్వు ఆనందిచే వేళ.....నీ పెదవిపై చిరునవ్వు నేనవుతా
నీవు బాధపడేవేళ.....నీ కంటిలో కన్నీరునవుతా
నీకు అన్నం పెట్టేవేళ.....అమ్మ చేతిని నేనవుతా
నీవు ఆడుకునే వేళ.....ఆట బొమ్మని నేనవుతా
నువ్వు చదువుకొనే వేళ .....నీ చేతిలో పుస్తకాన్నవుతా
నీవు ప్రార్దించేవేళ .....ప్రభువు ముందున్న కొవ్వొత్తి నేనవుతా
నువ్వు అదిరిపడే వేళ .....నీ గుండె చప్పుడు నేనవుతా
నీవు పెండ్లాడే వేళ.....నీ వేలికి తొడిగే ఉంగరమవుతా
నీ బిడ్డలను ముద్దాడే వేళ .....ఆ పాల బుగ్గలు నేనవుతా
నీవారి ప్రేమను పొందే వేళ .....నీ గుండెల్లో ఉప్పొంగే తరంగాన్ని నేనవుతా
నీవు కాటికెళ్ళే వేళ.....నిన్నుంచే శవపేటిక నేనవుతా
నేస్తమా ప్రతిక్షణం నీలోనే కలిసి ఉంటా ....
నీ తనువులో ప్రతి అణువు నేనై నిలిచి ఉంటా

తెలుగుతల్లిది ఏ ఊరు ..!?

నాదొక సందేహం
తెలుగుతల్లిది తెలంగాణా నా, ఆంధ్రానా,రాయలసీమా...?
కడుపులో,కనుచూపులో కరుణ ఉన్న మా తెలుగుతల్లికి మల్లెపూదండ వెయ్యరాదా

మము కన్నతల్లికి మంగళారుతులు ఇవ్వరాదా..!?

'తెలంగాణా గానం',
'నా తెలంగాణా కోటి రత్నాల వీణ' అన్న పదజాలం,
ఆ తెలుగు తల్లి గర్బంలోనుండి వచ్చినది కదా..!?

మరి ఏవరిదీ అరాచకం..?

కూర్చున్న కొమ్మను నరుక్కునే

అరాచకీయుల'దా..?

పాలుతాగిన రొమ్మును కాలుపెట్టితన్నే...

కిరాతక మౌన భాష'కులదా ..?


తెలంగాణా అన్నలారా,అక్కలారా..

" తెలంగాణా కోసం పోరాడుట భావ్యం
తెలుగుతల్లిని ముక్కలు చేయుట అనాగరికం"

ఇది నా అభిమతం.............