మిత్రమా...
నువ్వు ఆనందిచే వేళ.....నీ పెదవిపై చిరునవ్వు నేనవుతా
నీవు బాధపడేవేళ.....నీ కంటిలో కన్నీరునవుతా
నీకు అన్నం పెట్టేవేళ.....అమ్మ చేతిని నేనవుతా
నీవు ఆడుకునే వేళ.....ఆట బొమ్మని నేనవుతా
నువ్వు చదువుకొనే వేళ .....నీ చేతిలో పుస్తకాన్నవుతా
నీవు ప్రార్దించేవేళ .....ప్రభువు ముందున్న కొవ్వొత్తి నేనవుతా
నువ్వు అదిరిపడే వేళ .....నీ గుండె చప్పుడు నేనవుతా
నీవు పెండ్లాడే వేళ.....నీ వేలికి తొడిగే ఉంగరమవుతా
నీ బిడ్డలను ముద్దాడే వేళ .....ఆ పాల బుగ్గలు నేనవుతా
నీవారి ప్రేమను పొందే వేళ .....నీ గుండెల్లో ఉప్పొంగే తరంగాన్ని నేనవుతా
నీవు కాటికెళ్ళే వేళ.....నిన్నుంచే శవపేటిక నేనవుతా
నేస్తమా ప్రతిక్షణం నీలోనే కలిసి ఉంటా ....
నీ తనువులో ప్రతి అణువు నేనై నిలిచి ఉంటా
nice one
రిప్లయితొలగించండికవిత బాగుంది. మీ పదబంధాలతో నేస్తాన్ని కట్టడి చేసారు..
రిప్లయితొలగించండిచాలా బాగుందమ్మా కవిత ఆకరి రెండు లైన్లు హృదయాన్ని కదిలించేసాయి
రిప్లయితొలగించండికవిత చాలా బాగుందండి.
రిప్లయితొలగించండిnaaku nachindi mee blogu
రిప్లయితొలగించండిmee kavitalu bavunnayandi
రిప్లయితొలగించండి