తెలుగుతల్లిది తెలంగాణా నా, ఆంధ్రానా,రాయలసీమా...?
మము కన్నతల్లికి మంగళారుతులు ఇవ్వరాదా..!?
'తెలంగాణా గానం',
'నా తెలంగాణా కోటి రత్నాల వీణ' అన్న పదజాలం,
ఆ తెలుగు తల్లి గర్బంలోనుండి వచ్చినది కదా..!?
మరి ఏవరిదీ అరాచకం..?
కూర్చున్న కొమ్మను నరుక్కునే
అరాచకీయుల'దా..?
పాలుతాగిన రొమ్మును కాలుపెట్టితన్నే...
కిరాతక మౌన భాష'కులదా ..?
తెలంగాణా అన్నలారా,అక్కలారా..
" తెలంగాణా కోసం పోరాడుట భావ్యం
తెలుగుతల్లిని ముక్కలు చేయుట అనాగరికం"
ఇది నా అభిమతం.............
ఇది వరకు విదేశీ ముష్కరులు మన విగ్రహాలను పగులకొడితే ఇప్పుడు స్వదేశీయులే, స్వభాషీయులే తెలుగుతల్లి విగ్రహాన్ని పగులకొట్టడం విచార కరం, దురదృష్టకరం.
రిప్లయితొలగించండిWell Expressed.
రిప్లయితొలగించండిమొత్తం మానవ జాతి మనుగడకే ప్రమాదంగా పరిణమించిన గ్లోబల్ వార్మింగ్ వంటి సమస్యలపై కలిసి పోరాడాల్సిన ఈ సమయం లో కేవలం కొన్ని రాజకీయ పార్టీలు తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి ఆడుతున్న నాటకంలో పావులుగా మారి విడిపోవడానికి కొట్టుకుంటున్నాం. ఒక ప్రక్క మతవాదం, కులవాదం విషాన్ని విరజిమ్ముతుంటే దానికి తోడుగా ఈ వేర్పాటువాదం ఒకటి మొదలయ్యింది. విద్వేషాలున్నా,లాలూచీలున్నా అవన్నీ రాజకీయ నాయకుల మధ్యేగాని, ఎప్పుడైన సగటు జీవులైన మనం నీది తెలంగాణ నాది ఆంధ్ర అని దెప్పిపొడుచుకున్నామా? లేదుగా?. సమైక్యంగా ప్రశాంత జీవనం సాగిస్తున్న మన మీద మళ్ళి ఈ సమ్మెట పోటు వేసిందెవరు? రాజకీయ నేతలు కాదా?
రిప్లయితొలగించండిఇప్పటి ప్రతిపక్షం ఒకప్పుడు పాలకపక్షంగా ఉన్నప్పుడు ఇప్పుడు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి అప్పటి డిప్యూటి స్పీకర్. మంత్రి వర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వలేదని వేర్పాటువాద పార్టీ ఒకటి స్థాపించారు. వారి నడవడి నోటి దురుసుతనం తెలంగాణా ప్రాంత ప్రజలకు కూడా రుచించక ఎన్నికల్లో ఓడించారు. పార్తీ మనుగడ ప్రశ్నార్ధకమైన ఈ తరుణంలో మొదలైన మిగతా కథ మీ అందరికీ తెలిసిందే. మరి వాళ్ళ స్వార్ధ ప్రయోజనాలకోసం అన్నదమ్ములలాంటి మనమెందుకు కొట్టుకోవడం. మాండలికాలు వేరైనా మనమంతా తెలుగువారమే.
రాజన్
http://naagola.wordpress.com/
అబ్బో దీని గురించి పెద్ద చర్చే జరిగింది.. ఇక్కడ:
రిప్లయితొలగించండిhttp://telugabbai.wordpress.com/2009/10/31/
తెలుగు తల్లి విగ్రహ ధ్వంసాన్ని ఎవరూ హర్షించరు.
రిప్లయితొలగించండికానీ తెలుగు తల్లిని వశీకరణ మంత్రంగా ప్రయోగించి తెలంగాణాను వంచిస్తున్న ఆంద్ర నేతల కుట్రను కూడా ఎవరూ సహించరు.
పాలకుల కుట్ర వల్లే తెలుగు తల్లి కి, పొట్టి శ్రీరాములు విగ్రహాల కి ఈ దుర్గతి పట్టింది.
ప్రత్యెక తెలంగాణా ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీసేందుకు తెలంగాణా లో తెలుగు తల్లి విగ్రహాలను ఆవిష్కరించారు. ఒకటి హైదరాబాద్ లో మరొకటి కరువు జిల్లా మహబూబ్ నగర్ లో.
ఆంద్ర రాయల సీమల్లో ఒక్క తెలుగు తల్లి విగ్రహమైనా లేదు గమనించారా? మొన్న మొన్న తిరుపతిలో పెట్టిన ముచ్చటైన మూడో విగ్రహం తప్ప.
ఇది కుట్ర కాదంటారా?
అట్లాగే పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆంద్ర నేతలు తమ సామ్రాజ్య వాద ఆకాంక్షకు , తెలంగాణా మీద తమ పెత్తనానికి ప్రతీకగా తెలంగాణా లో అక్క దక్కడా నెలకొల్పారు.
అస్తిత్వ పోరాటం ఉధృత మైనప్పుడు తమ అస్తిత్వాన్ని దెబ్బ తీసిన పెత్తం దార్ల ప్రతీకలపై కొందరు అతివాదులు సహజంగానే దాడులు చేస్తారు.
దాడులు చేసిన వారినే కాదు ఆ పెత్తం దార్లను కూడా మనం ఖండించాలి.
i need clarity
రిప్లయితొలగించండిok may be in ur way ur right but u does n't have rights to comment on leaders