యుగాంతం అవుతుందా ?
అవును ! యుగం అంతం అవుతుంది!
అవునూ !యుగాంతం అవుతుంది.
మయాన్ల లెక్కల ప్రకారమే అవ్వదు యుగాంతం.
మూడనమ్మకాల భుక్కుల చేతుల్లో అవుతుంది యుగాంతం !
ప్రకృతి వైపరిత్యాల వల్లే కాదు యుగాంతం.
వికృత మానవుల అకృత్యాల వల్ల అవుతుంది యుగాంతం !
భూమిలో కృష్ణబిలాలు ఏర్పడే కాదు యుగాంతం.
కడుపులో ఆకలి జ్వాలలు ఎగసి అవుతుంది యుగాంతం!
అయస్కాంత అణువుల్లో మార్పుల వల్లే కాదు యుగాంతం.
అరాచ(జ)కీయ శక్తుల కుట్రల వల్ల అవుతుందీ యుగాంతం !
'నవ'గ్రహాల గతులు తప్పే కాదూ యుగాంతం.
నవనాగరికత శృతి తప్పీ అవుతుంది యుగాంతం !
సముద్రంలో సునామీలు వచ్చే జరగదు యుగాంతం.
మనుషుల్లో మానవత్వం చచ్చీ అవుతుంది యుగాంతం !
అవుతుంది యుగాంతం ! అవుతుంది యుగం అంతం !
చాలా చాలా బాగుంది ఎంత నిజాన్ని ఎంత అందం గా కళ్ళ ముందు ఆవిష్కరించేరు.. చాలా బాగుంది..
రిప్లయితొలగించండిఈ సారి "స్నేహసుధ" కు కాకుండా దీనికి వాఖ్య ఎందుకు రాస్తున్నానంటే...అక్కడ ఆ అందమయిన కథ చదువుతుంటే పక్కనే " అవుతుందీ యుగాంతం " అని కనపడింది. ఇదేంటి యుగాంతాం కాదు అని చెప్పలిసిన యువతకూడా ఇలా యుగాంతం అవుతుందీ అనే మూడనమ్మకాలు నమ్మితే ఎలా ?
రిప్లయితొలగించండిఅనుకుంటూ ఈ బ్లాగ్ ఒపెన్ చేసా. ఎంత బాగా రాశావమ్మ.
అరాచ(జ)కీయ శక్తుల కుట్రల వల్ల,
నవనాగరికత శృతి తప్పీ,
మనుషుల్లో మానవత్వం చచ్చీ
యుగాంతం అవుతుందీ.. అని.
భేష్ ! ఇంతకంటే నాకు మాటలు లేవు చెప్పడానికి.
బాగా వ్రాసారు మొదటి ప్రైజు మీకే
రిప్లయితొలగించండిbaagundi ....
రిప్లయితొలగించండి