జాతీయ సమైక్యతా"వాణి" ఎం.ఎస్ సుబ్బలక్ష్మి





కంఠంలో దాచెనేమో సుధాభాండాగారం
పండితపామరులను సైతం రంజింపజేసెను ఆ గాత్రం

మధురైలో పుట్టిపెరిగిన మణిమాణిక్యం
లాలిపాటలోనే ఆలకించెను వీణానాధమాధుర్యం

అమ్మ పెట్టిన గోరుముద్దలే సరిగమపదనిసలు
నాన్న నేర్పిన తొలిపలుకులే సంగీతస్వరాలు

వేసెను మొదటి అడుగులు భక్తి మార్గంలో
చేసెను సాధనలు సుస్వరరాగఝరీధారలో

బడిలో బెత్తంతో బెదిరించి దూరమయిన విద్యను
గుడిలో గానంతో మెప్పించి గాత్రమున కలుపుకొనెను

మధురగాన ప్రవాహానికి కదిలివచ్చిన ఆ "సదాశివుడు "
మార్గము చూపి గురువై, మనసిచ్చి సగభాగమయ్యడు

వెండితెరపై జనరంజని "శకుంతల"య్యెను
"మీరా"గా జాతిగుండెలకు చేరువయ్యెను

'కౌసల్యా సుప్రజారామా' అన్న సుప్రభాతానికి మేల్కొనిన వెంకటేశుడు
'భజగోవిందం మూఢమతే ' అన్న కీర్తనకు ముగ్దుడైపోయినాడు

ఆధ్యాత్మికారాధనలు గాత్రంలో చేరి వికసించెను "పద్మ"మై
దశదిశలా సంగీతసౌరభాలను వెదజల్లెను గానగంధర్వమై

సాంప్రదాయ బాణిని తన గళంలో దాచిన 'సంగీతకళా'నిధి"కి
'భారతరత్న"యే కోరివచ్చి హారమయ్యెను ఆ కంఠసీమకు




8 కామెంట్‌లు:

  1. శ్రీకాంత్ గారు thanks.

    బా.రా.రె గారు మీ వాఖ్య (On subbalakshmi kavitha, my feeling



    “ఈ కవితను మొదటిసారిగా చదివినప్పుడు బాగుందనిపించింది.

    ఇంతకు ముందు సుబ్బలక్షి గారి గానం వినగానే సుబ్బలక్ష్మి రూపు కళ్ళముందు మెదిలేది

    ఇప్పుడు ఆమెతోపాటి మీ కవిత కూడా ...



    ప్రశంశ కాదు..నిజం.”

    ) e-mail ద్వారా అందుకున్నాను మీ అభిమానానికి ఎప్పుడూ కృతజ్ఞురాలిని.

    రిప్లయితొలగించండి
  2. వెన్నెల గారు,

    కొన్ని రోజులుగా మీ బ్లాగ్ ని ఫాలో అవుతున్నాను, చాలా బాగుంది!..
    మీ సృజనాత్మకత అధ్బుతమండి!!

    రిప్లయితొలగించండి
  3. వెన్నెల: చాలా బాగుంది మీ కవిత ఆ అధ్బుత కళా మూర్తి కి నీరాజనాలద్దుతూ.. వీణా తంత్రులను గళ తంత్రులు చేసుకున్న ఆ అమర్ జీవి గురించి ఎంత చెప్పినా తక్కువే.. మంచి కవిత.

    రిప్లయితొలగించండి
  4. అరుణ్ గారూ,నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్.. చాలా రోజులుగా ఫాలో అవుతున్నానన్నారు. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. .

    రిప్లయితొలగించండి
  5. వెన్నెల గారు చాలా బాగుంది!

    బాగా రాసారు...... నాకు బాగా నచ్చిన పాట భావయామి గోపాల బాలం మనసేవితం గుర్తుకు వచ్చింది

    రిప్లయితొలగించండి
  6. పరుచూరి వంశీ కృష్ణ గారు... "నాకు బాగా నచ్చిన పాట భావయామి గోపాల బాలం మనసేవితం గుర్తుకు వచ్చింది"...
    మీకు అలాంటి పాటలువినే సుత్తి టాలెంట్ కూడా ఉందా ...?(:-)))

    రిప్లయితొలగించండి