ఓ కలా?

ఆ సాగర తీరాన ఉన్నాను నేను
పడమటి కొండలలో సూర్యుడస్తమిస్తున్నాడు,
అదిగో వచ్చేస్తుంది ఆ కెరటం..
ఆ సముద్రం ఆకలిగా చూస్తోంది.
వచ్చే కెరటం ఆగదు దాని ఆకలి తీరదు
ఈ సమయం లో వాటితో సహకరించాలనుకున్నా,,
అందుకే కళ్ళు మూసుకున్నా.....
కెరటం వచ్చిన అలజడి-.-.-.
ఆకలి తీరిన సముద్రపు చిందుల సవ్వడి~~~~~
కళ్ళు తెరిచిచూడాలనుకున్నా కనిపించే ఆ స్వర్గం
కానీ... కానీ... నా కళ్ళు తెరుచుకోలేదు
నా గుండె ఆడడం లేదు ! నా శ్వాస ఆడుతుందో లేదో..
అరె!.. నా కళ్ళు తెరుచుకున్నాయి.!
ఇది..ఇది..నిజం కాదా !? ఇదంతా నా కలా..!???

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి